calender_icon.png 5 July, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినతులే స్వీకరిస్తారా.. రశీదులు ఇవ్వరా..?

18-06-2025 12:00:00 AM

  1. భూ భారతి సదస్సులో రెవెన్యూ అధికారుల వింత చేష్టలు

బాధితులకు ఇక న్యాయం జరిగేది ఎట్లా..!

మందమర్రి, జూన్ 17: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులు నామ మాత్రంగానే నిర్వహిస్తున్నారు. భూ సమస్య లు పరిష్కరించాల్సిన రెవెన్యూ  అధికారులు సమస్యలు పరిష్కరించకుండా రైతులను ఇబ్బందుల గురి చేస్తున్నారని ఆరోపణలు మండల వ్యాప్తంగా ఓ వైపు వ్యక్తమవుతుండగా, మరోవైపు అధికారులు సైతం అదేవి ధంగా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల మండలంలోని ఒక గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులు బాధిత రైతు తన భూమికి సంబంధించిన సమస్య పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేయగా, దానికి సంబంధించి రశీదు కావాలని అడిగితే ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన మం డలంలో చర్చనీయాంశంగా మారింది.

బాధి త రైతు తన భూమి సమస్యపై భూ భారతి రెవెన్యూ  సదస్సులో భూమి సమస్యను పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు చేయగా అక్కడ విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహశీల్దార్ రిసిప్ట్  మీద స్టాంపు వేయలేదు, కనీ సం అధికారి సంతకం కూడా పెట్టలేదు.ఈ విషయంపై బాధిత రైతు తన బాధను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు.

దీనిపై కలెక్టర్ స్పందించి బాధిత రైతుకు న్యాయం చేయాలని, భూ భారతి రెవెన్యూ  సదస్సులో ఇష్టా రాజ్యంగా విధులు నిర్వహిస్తున్న అధికారులపై శాఖపర మైన చర్యలు తీసుకోవాలని మండల రైతు లు కోరుతున్నారు.ఈ విషయం  కలెక్టర్ స్పందించి న్యాయం చేయకుంటే హైదరాబాద్‌లోని తెలంగాణ భూ పరిపాలన శాఖాధి కారుల దృష్టికి తీసుకు వెళ్ళి న్యాయం జరిగే వరకు ఆందోళనలు చేపడతానని మండల రైతులు తెలిపారు.