calender_icon.png 29 October, 2025 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ఛట్ పూజ వేడుకలు

29-10-2025 12:14:13 AM

పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ దంపతులు

పటాన్చెరు, అక్టోబర్ 28 : ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో సూర్య భగవానుడిని ఆరాధిస్తూ నిర్వహించుకునే ఛట్ పూజ ఉపవాస దీక్షల ముగింపు కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై సూర్య అస్తమయం నుండి ఉపవాస దీక్షలతో ప్రారంభమైన ఛట్ పూజ కార్యక్రమాలు మంగళవారం ఉదయం సూర్యోదయంతో సూర్య భగవానుడుని ఆరాధిస్తూ ఘనంగా ముగిసాయి.

మంగళవారం తెల్లవారుజామున జరిగిన ముగింపు కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవంతుని కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.

ఉత్తర భారతీయుల ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్నిటిని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, గూడెం విక్రమ్ రెడ్డి, భారీ సంఖ్యలో ఉత్తర భారతీయులు పాల్గొన్నారు.