29-10-2025 12:15:17 AM
చారకొండ అక్టోబర్ 28: అడుగడుగునా మోకాళ్ల లోతు గుంతలు.. చినుకు పడితే ఆ గుంతల్లో నీరు.. ఇలాంటి రోడ్ల మీద ప్రయా ణం చేయాలంటే నరకాన్ని తలపిస్తుందని ప్రజలు వాపోతున్నారు. మండల కేంద్రం నుంచి చంద్రయాన్ పల్లి, గోకారం మీదుగా గోకారం గేట్ వరకు సుమారు 12 కి.మీ. మే ర ఉన్న మట్టి రోడ్డు గుంతల మయంగా మా రింది. ఈ రోడ్డు గుండా ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు, వా హన దారులు వాపోతున్నారు.
గత కొన్ని రో జులుగా కురుస్తున్న వర్షాలకు ఈ రోడ్డు పై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి బురద మ యంగా మారింది. నిత్యం ఈ రహదారిపై రా కపోకలు సాగించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా వ ర్షాకాలంలో మట్టి రోడ్లు కోతకు గురై గుం తలు ఏర్పడుతాయి. ఆ సమ యంలో ప్ర యాణం నరకప్రాయంగా ఉందని ఎన్ని ప్ర భుత్వాలు మారినా ఈ రోడ్లు బాగు పడడం లేదని అంటున్నారు. ఈ రోడ్డును బీటీ రహదారిగా మార్చడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి టెండర్ ప్రక్రియను పూర్తి చే సినా కాంట్రాక్టర్ మాత్రం పనులు ప్రారంభించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాడని ఇప్పటి కైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవతీసుకుని బీటీ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలుకోరుతున్నారు.