calender_icon.png 29 October, 2025 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం

29-10-2025 12:13:25 AM

  1. మెదక్ జిల్లాలో అర్ధరాత్రి అకాల వర్షం
  2. లబోదిబోమంటున్న రైతన్నలు
  3. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

మెదక్, అక్టోబర్ 28 (విజయక్రాంతి)/వెల్దుర్తి: మెదక్ జిల్లాలో కౌడిపల్లి, వెల్దుర్తి, కొ ల్చారం మండలాల రైతులను అకాల వర్షం ఆగమాగం చేసింది. సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షం ఆరబెట్టిన ధాన్యాన్ని తడిసి ముద్ద చేసింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. సోమవారం పగలంతా వాతావరణ పొడిగా ఉండడంతో రైతులు వారం పది రోజులుగా ఆరబెట్టిన ధాన్యాన్ని అ లాగే ఉంచారు. దీంతో అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో వచ్చిన అకాల వర్షం ధాన్యాన్ని తడిసి ముద్ద చేసింది.

ఇళ్ల నుండి కేంద్రాలకు చేరుకునేలోపే ధాన్యం తడిసి ముద్దయిపోయింది. కోతలు పూర్తిస్థాయిలో కాలేక ఇటు ధాన్యం అటు కోత రెండు రకాలుగా నష్టపోయామని రైతులు వాపోయారు. కొనుగోలు చేసిన ధాన్యం సైతం కేంద్రాల వద్దనే ఉండిపోయింది. కౌడిపల్లి మండల పరిధి పాంపల్లి కొనుగోలు కేంద్రం వద్ద సోమవారం ధా న్యం నింపిన లారీ లోడుతో సహా వర్షంలో ఉండటంతో మంగళవారం ఉదయం రెండు జేసీబీలతో బయటకు తీశారు.

తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. వెల్దుర్తి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో పది రోజులు గడుస్తున్నా పూర్తిస్థాయిలో కాంట మొదలు కాకపోవడం, పూర్తిస్థాయి లో మిల్లులు అనుమతి రాకపోవడంతో ప్ర స్తుతం రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టుగా మారింది. దీనికి తోడు అ కాల వర్షంతో ఎండబెట్టుకొని పట్టుకున్న ధా న్యం కూడా తడవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

దీనికి తోడు ప్రతి సెంటర్లో ధాన్యం పట్టుకునే మిషన్లు కూడా పూర్తిస్థాయిలో నడవక మొరాయిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, యుద్ధ ప్రాతిపదికపై రైతుల ధా న్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీ సుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.