18-02-2026 08:11:01 PM
తాండూరు,(విజయశాంతి): హిందూ హృదయ సామ్రాట్ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గురువారం వికారాబాద్ జిల్లా తాండూర్ లో భారీ ర్యాలీ తో వేడుకలు నిర్వహిస్తున్నామని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, హిందూ వాహిని కార్యకర్తలు తెలిపారు. విశ్వహిందూ పరిషత్ యువ నాయకుడు రజినీకాంత్, భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు నాగారం మల్లేష్, అంతరం కిరణ్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయం నుండి ఉదయం 11 గంటలకు శోభ యాత్ర ర్యాలీ ప్రారంభం అవుతుందని శివాజీ చౌక్ వరకు భారీ ర్యాలీ ఊరేగింపు ఉంటుందని అన్నారు,. ఈ కార్యక్రమానికి యువతీ, యువకులు, మహిళలు, హిందు వాహిని కార్యకర్తలు స్థానికులు గ్రామాల ప్రజలు భారీగా పాల్గొనాలని వారు కోరారు.