20-02-2026 01:23:41 AM
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ శోభాయాత్ర
ఆదిలాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): మొగల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మరాఠా యోధుడు... హిందువుల హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయం తి వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రం తో పాటు ఆయా మండలాల్లో హిందూ సంఘాలు, మరాఠా సమాజ్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ శోభాయాత్రలో ప్రజలు, యువకులు పాల్గొని జై శివాజీ.. జై భవాని.. నినాదాలతో హోరెత్తించారు.
శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా తలమడుగు మండలంలోని సుంకిడిలో నూతనంగా ఏర్పాటు చేసిన శివా జీ మహారాజ్ విగ్రహాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. అదేవిధంగా ఆదిలాబాద్‌లో జరిగిన శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతీ స్వామీజీ, మాజీమంత్రి జోగు రామన్న, మున్సిపల్ చైర్పర్సన్ అనూష సతీష్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పాల్గొని శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువు రు హిందూ సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.