15 April, 2026 | 12:27 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అందని స్టడీ మెటీరియల్

20-02-2026 01:25 AM
  1. ఆశ్రమ పాఠశాల విద్యార్థులపై అధికారుల నిర్లక్ష్యం...

ప్రారంభమైన ఫ్రీ ఫైనల్ పరీక్షలు

ఆందోళన చెందుతున్న టెన్త్ విద్యార్థులు

ఉట్నూర్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని 124 గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతు న్న 3,875 బాల బాలికలకు పదో తరగతి స్టడీ మెటీరియల్  నేటికీ సరఫరా చేయలేదు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పేద గిరిజన విద్యార్థులను ఉన్నత విద్యావంతుల తీర్చిదిద్దుటకు  ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ప్రత్యేకంగా ఆశ్రమ పాఠశాలను ఏర్పా టు చేసింది.

ఈ ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఏటా వార్షిక పరీక్షలకు ముందు  స్టడీ మెటీరియల్ తో పాటు అభ్యాసగా దీపికలు, పరీక్ష ప్యాడ్‌లు, పెన్నులు, కంపాక్స్ బాక్సులు  అందజేయాల్సి ఉంది. కానీ ఈ ఏడాది  ప్రీ ఫైనల్ పరీక్షలు ఈనెల 17న ప్రారంభమైన నేటికీ ఆశ్ర మ పాఠశాలలకు స్టడీ మెటీరియల్ అందించలేదు. దీంతో విద్యార్థిని విద్యార్థులు.. స్టడీ మెటీరియల్ కోసం ఎదురు చూడవలసి వస్తుంది. వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న స్టడీ మెటీరియల్ రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 

పదో తరగతి వార్షిక పరీక్షలకు రెండు నెల ల ముందు ప్రతి ఆశ్రమ పాఠశాలలకు ఉట్నూ ర్ ఐటీ.డిఏ ఆధ్వర్యంలోని విద్యాశాఖ ఆధ్వర్యంలో అదిలాబాద్ జిల్లా, కొమరం భీం ఆసి ఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల పరిధిలోని 124 గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠ శాలలో పదో తరగతి చదువుకునే బాల బాలికలకు  ముందస్తుగా స్టడీ మెటీరియల్‌ను సరఫరా చేసేవారు.

ఐటిడిఏ, విద్యాశాఖ అధికారుల ముందుచూపు కొరవడంతో ఫ్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభమైన నేటికీ ఆశ్రమాలకు స్టడీ మెటల్ సరఫరా చేయలేకపోతున్నారు. ఇప్పటికైన ఐటీడీఏ, విద్యాశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకొ ని ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుకునే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ తో పాటు సామాగ్రి సరఫరా చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఆలస్యమైన మాట నిజమే...

పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్, ఇతర సామాగ్రి అందజేయ డంలో ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. రెండు మూడు రోజుల్లో పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్, ఇతర సామాగ్రి అందజేస్తాం. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దు.

 అంబాజీ జాదవ్ గిరిజన సంక్షేమ శాఖ అధికారి (డీడీ)