10 July, 2026 | 2:13 PM

చియాన్ 63ని ప్రకటించేశారు..

15-12-2024 12:00 AM

చియాన్ విక్రమ్, డైరెక్టర్ మడోన్ అశ్విన్‌తో కొలాబరేషన్‌లో ఓ చిత్రం రా నుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రక టన శనివారం వచ్చేసింది. ‘చియాన్ 63’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని మేక ర్స్ రూపొందించనున్నారు. శాంతి టాకీస్ ప్రొడక్షన్ నంబర్ 3గా తెరకెక్క నున్న ఈ సినిమాను అరుణ్ విశ్వ అ త్యంత ప్రతి ష్టాత్మకంగా నిర్మించను న్నారు. శనివారం   ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

విక్రమ్‌కు సరిపోయే సబ్జెక్ట్‌ను మడోన్ అశ్విన్ సిద్ధం చేశారు. ఈ చిత్రంలో విక్రమ్‌ను సరికొత్త అవతార్‌లో చూపించబోతున్నారట. ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం కానుందనేది మా త్రం ప్రక టించలేదు. ఈ సందర్భంగా నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ.. “దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరైన చియాన్ విక్రమ్ సర్‌తో కలిసి మా ప్రొడక్షన్ నంబర్ 3ని ప్రకటించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ప్ర యాణం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. మ నకు ఎన్నో చిరస్మరణీయమైన పాత్రలు, సంచలనాత్మక చిత్రాలను విక్రమ్ అందిం చారు.

అలాంటి నటుడితో చేతు లు కలపడం మాకు గౌరవం. ఈ చిత్రానికి మం డేలా, మావీరన్‌లను అందించిన అత్యుత్తమ డైరెక్టర్ మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ కథ ప్రతి ఒక్కరికీ నచ్చు తుంది. ఈ చిత్రంపై మడోన్ అశ్విన్ పూర్తి దృష్టి సారించారు. ప్రొడక్షన్ హౌస్‌గా, మేము రెండవసారి మడోన్‌తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. మేమంతా కలిసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే చిత్రాన్ని అందించబోతున్నాం” అన్నారు.