15 June, 2026 | 2:01 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్

02-04-2026 01:09 AM

చేగుంట ఏప్రిల్ 1: తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం చేగుంట చికెన్ సెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణం లో ఉన్న చికెన్ వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ చేసి గాంధీ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పౌల్ట్రీ కంపెనీలు,రిటైల్ వ్యాపారులకు ఇచ్చే మార్జిన్ను భారీగా తగ్గించడం వల్ల తాము తీవ్ర నష్టాల్లో ఉన్నామని, దుకాణాల అద్దెలు, కరెంటు బిల్లులు, కార్మికుల జీతాలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, కాంగ్రెస్ నాయకులు సండ్రుగు సతీష్, వార్డు సభ్యులు ఆరిఫ్ మొహమ్మద్ శకీల్, మహమ్మద్ సలీం, మహమ్మద్ కలీం, హామీద్, కటిక శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.