23 May, 2026 | 2:20 AM

నేడు గుట్టకు ముఖ్యమంత్రి రాక

23-05-2026 01:05 AM
  1. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం
  2. పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్

యాదగిరిగుట్ట, మే 22 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని శనివారం ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి దర్శించుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న సం దర్భంగా ఏర్పాట్లను విప్ బీర్ల ఐలయ్య శుక్రవారం పరిశీలించారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా యాదగిరిగుట్ట కొండ కింద రిం గురోడ్డు మధ్యలో గల హెలిప్యాడ్ ను అధికారులతో కలిసి ప్రభ్వుత విప్ సందర్శించారు. అనంతరం టెంపుల్ సిటీ నందు వేద పాఠశా ల భూమి పూజను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా సాగేందు కు అధికారులు చేపట్టిన ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

యాదగిరిగుట్ట టెంపు ల్ సిటీ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, భద్రతా చర్యలు, పారిశుధ్య నిర్వహ ణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పా ట్లు, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారుల తో చర్చించి సూచనలు చేశారు.  అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులున్నారు.