27 April, 2026 | 8:41 PM

పిల్లలను ఒంటరిగా ఈతకు పంపొద్దు

27-04-2026 06:56 PM

* పిల్లల ఈత సరదా తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగల్చవద్దు

* మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు

* పిల్లలను సృజనాత్మకత వైవు మల్లించండి 

* ప్రజా పాలన ప్రగతి ప్రక్షాళనలో భాగంగా చైల్డ్ సేఫ్టీ కార్యక్రమం

పాపన్నపేట: వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు ఈతకు వెళ్లే విషయంలో తల్లిదండ్రులు  అప్రమత్తత పాటించాలని ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ సూచించారు. సోమవారం మండల కేంద్రమైన పాపన్నపేట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ప్రజా పాలన ప్రగతి ప్రక్షాళనలో భాగంగా చైల్డ్ సేఫ్టీ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు అవగహన కల్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశముందని హెచ్చరించారు. నీటి లోతు తెలియకపోవడం, జారి పడటం వంటి కారణాలతో చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నయని పేర్కొన్నారు.

కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయరాదన్నారు. పిల్లలకు ఈత నేర్పించాలని అనుకుంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు, పెద్దల పర్యవేక్షణలోనే నేర్పించాలని సూచించారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలను గుర్తు చేస్తూ, అటువంటి చర్యలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రులను హెచ్చరించారు. ఈ సందర్బంగా పిల్లలకు క్యారం బోర్డు, వాలీబాల్ కిట్ లను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేందర్ గౌడ్, ఉప సర్పంచ్ సద్దాం, వార్డు సభ్యులు, గ్రామ యువకులు, ప్రజలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.