25 August, 2026 | 2:35 AM

పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక

17-06-2026 08:26 AM

ప్రశ్న: సిరిసిల్లలో ఏమి జరిగింది?
జవాబు: తంగళ్లపల్లి మండలంలో పానీపూరి తిన్న తర్వాత 10 మందికి పైగా చిన్నారులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఫుడ్ పాయిజన్ అనుమానం వ్యక్తమవుతోంది.

దేశవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్య వార్తల కోసం విజయక్రాంతి న్యూస్ హోమ్‌పేజ్ చూడండి.

తంగళ్ళపల్లి జూన్ 17 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో(KCR Nagar Colony) ఫుడ్ పాయిజన్ అనుమానిత ఘటన కలకలం రేపింది. పానీపూరి తిన్న అనంతరం 10 మందికి పైగా చిన్నారులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. బాధిత చిన్నారులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. 

ఇలాంటి తాజా అప్‌డేట్స్ కోసం తాజా వార్తలు ఫాలో అవ్వండి.

జ్వరంతో ఓ చిన్నారికి ఫిట్స్ వచ్చినట్లు సమాచారం. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పరిశీలిస్తున్నారు. అస్వస్థతకు పానీపూరి కారణమా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే అంశంపై అధికారులు విచారణ చేపట్టారు.ఈ ఘటనతో తల్లిదండ్రులు, కాలనీ వాసులు ఆందోళనకు గురయ్యారు. కేసీఆర్ నగర్ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దేశ రాజకీయాలపై మరిన్ని వార్తల కోసం జాతీయ వార్తలు చదవండి.

FAQ's

1. సిరిసిల్లలో చిన్నారులు ఎందుకు అస్వస్థతకు గురయ్యారు?

పానీపూరి తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అనుమానంతో చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.

2. ఎన్ని మంది ఆసుపత్రిలో చేరారు?
10 మందికి పైగా చిన్నారులు ఆసుపత్రిలో చేరారు.

3. పిల్లల్లో ఏ లక్షణాలు కనిపించాయి?
వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించాయి.

4. ఘటన ఎక్కడ జరిగింది?
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని కేసీఆర్ నగర్ కాలనీలో జరిగింది.

5. అధికారులు ఏమి చేస్తున్నారు?
ఈ ఘటనపై విచారణ చేపట్టి అసలు కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.