బాలల ఆరోగ్యం, భద్రతకు పెద్దపీట
ప్రత్యేక అవగాహన కార్యక్రమం
వరంగల్‌లో పీడియాకాన్ 2026 సందడి
వరంగల్, ఆగస్టు 28 (విజయక్రాంతి): బాలల ఆరోగ్యం, భద్రతకు పెద్దపీట వేస్తూ భారతీయ బాల వైద్యుల సమాఖ్య ఆధ్వర్యం లో వరంగల్‌లో బాలలపై హింస నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. బాలలపై జరుగుతున్న హింస, వేధింపులు, దుర్వినియోగాన్ని గుర్తించి నివారించడంతో పాటు ప్రతి చిన్నారికి సురక్షిత మైన వాతావరణాన్ని కల్పించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా సీఐఏపీ ఈబీ డాక్టర్ బి. సు గుణాకర్ రెడ్డి, పీఏటీఎస్ అధ్యక్షుడు డాక్టర్ గూడురు విజయ్ కుమార్, వరంగల్ బాల వైద్యుల అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ జి. రమేష్ మాట్లాడుతూ బాలల రక్షణ కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. బాలల్లో శారీరక, మానసిక మార్పులను గుర్తించి సకాలంలో స్పందించడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చన్నారు.
కార్యక్రమంలో డాక్టర్లు శ్రీరామ్‌రెడ్డి, ఎస్ కృష్ణమూర్తి, సుంకోజ్ భాస్కర్, ఎన్‌ఎల్‌శ్రీధర్, రాజీవ్, జగదీష్, అశోక్, సంధ్య, సభియా, ఎం శేషు మాధవ్, కరుణాకర్ గారే, బలరాం,భోజా, పి అనిల్ కుమార్, అన్వేషిణి పాల్గొన్నారు. భారతీయ బాల వైద్యుల సమాఖ్య అధ్యక్షురాలు డాక్టర్ నీలం మోహన్, అధ్యక్ష పదవికి ఎన్నికైన డాక్టర్ ఎం సింగరవేలు తదితర ప్రముఖ బాల వైద్యులు హాజరయ్యారు. ఇదే సందర్భంగా భారతీయ బాల వైద్యుల సమా ఖ్య కేంద్ర మండలం, 12వ తెలంగాణ రాష్ట్ర సదస్సు పీడియాకాన్2026కు వరంగల్ వేదికైంది.
శుక్ర, శని, ఆదివారాల్లో, సత్యసాయి కన్వెన్షన్‌లో జరిగే ఈ సదస్సుకు పీడియాట్రిక్స్ రీడిఫైన్డ్ ప్రెసిషన్, ప్రివెన్షన్ అండ్ ప్రాక్టీస్ ప్రధాన ఇతివృత్తంగా ఉంది. మూడు రోజుల సదస్సులో బాలల వైద్యం లో ఆధునిక చికిత్సా విధానాలు, వ్యాధుల నివారణ, బాలల ఆరోగ్య పరిరక్షణ, పిల్లల టీకాలపై వైద్య నిపుణులు చర్చించనున్నారు. బాలల ఆరోగ్యం.. భద్రత.. భవిష్యత్తు కోసం వైద్య విజ్ఞానాన్ని, సామాజిక బాధ్యతను కలిపే వేదికగా పీడియాకాన్2026 నిలవనుంది.






