భారీ అండాశయ తిత్తి తొలగింపు
తీవ్ర గుండె జబ్బుతో బాధపడుతున్న మహిళ
విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించిన మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): హైదరాబాద్‌కు చెందిన 69 ఏళ్ల రొద భా య్ భారీ అండాశయ తిత్తి (ఓవేరియన్ సిస్ట్) కారణంగా కడుపులో తీవ్రమైన అసౌకర్యం, ఒత్తిడితో బాధపడుతూ మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌లో చేరారు.ఆమె ఇప్పటి కే తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతుండటంతో ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది.
శస్త్రచికిత్సతో పాటు మత్తుమందు ఇవ్వ డం కూడా గుండెపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో, ఈ అధిక ప్రమాదాన్ని అధిగమిస్తూ మెడికవర్ హాస్పిటల్స్ లోని బహుళ విభాగాల వైద్య నిపుణుల బృందం జాగ్రత్తగా ప్రణాళిక రూపొందించి భారీ అండాశయ తిత్తిని విజయవంతంగా తొలగించింది. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను డాక్టర్ మాధవి డొక్కు, గైనకాలజిస్ట్ నేతృత్వంలో నిర్వహించారు.
డాక్టర్ ప్రమోద్ కు మార్ కుచులకంటి, కార్డియాలజిస్ట్ గుండె సంబంధిత అంశాలను పర్యవేక్షించగా, డాక్ట ర్ శ్రీనివాస్, అనస్థీషియాలజిస్ట్ మత్తుమం దు నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. శస్త్రచికిత్సకు ముందు, శస్త్రచికిత్స సమయంలో, అనంతరం రోగి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ముగ్గురు నిపుణులు సమన్వయం తో చికిత్స అందించారు. డాక్టర్ మాధవి డొ క్కు మాట్లాడుతూ, భారీ అండాశయ తిత్తిని తొలగించడం సాధారణ పరిస్థితుల్లోనే సవాలుతో కూడుకున్న శస్త్రచికిత్స. ఈ రోగికి తీవ్ర మైన గుండె జబ్బు ఉండటంతో ప్రమాదం మరింత పెరిగింది. శస్త్రచికిత్స సమయంలో గుండె స్థితి స్థిరంగా ఉండేలా చూసుకుంటూనే తిత్తిని సురక్షితంగా తొలగించడం మా ప్రధాన లక్ష్యం. గైనకాలజీ, కార్డియాలజీ, అనస్థీషియా విభాగాల మధ్య సమన్వయం ఈ విజయానికి ఎంతో కీలకమైంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ కృష్ణవేణి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్ట ర్ ప్రశాంత్ పాల్గొన్నారు.






