27 July, 2026 | 6:06 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు

06-06-2026 08:52 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయ కాలక్షేప మంటపంలో శని వారం చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. మంచిర్యాలలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ ప్రాంగణంలో శ్రీనిధి నృత్య కళానిలయం నాట్యాచారిని కాపూడి వసుధ 30 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పత్రాలను అందజేశారు. దశావతారం, జతిస్వరం, రామాయణ శబ్దం తదితరాలపై చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి.