calender_icon.png 18 June, 2025 | 4:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలు చిన్నప్పటి నుంచే సన్మార్గం అలవర్చుకోవాలి

18-05-2025 04:22:55 PM

రైట్ రెవరెండ్ నక్క కిరణ్ కుమార్..

ఖానాపూర్ (విజయక్రాంతి): చిన్న పిల్లలు చిన్నతనం నుంచే దేవుని మార్గం, సన్మార్గం అలవర్చుకోవాలని, ఖానాపూర్ సిఎస్ఐ చర్చ్ పాస్టర్ రైట్ రెవరెండ్ నక్క కిరణ్ కుమార్(Reverend Nakka Kiran Kumar) అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ సిఎస్ఐ చర్చిలో మూడు రోజులుగా నడుస్తున్న వెకేషన్ బైబిల్ స్టడీ(వీబీఎస్) ముగింపు కార్యక్రమంలో ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ పాస్టరేట్ లో వున్న సుర్జాపూర్, కడం, బెల్లాల్, మద్దిపడగ, లింగాపూర్, గ్రామాల చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘాల నుంచి పలువురు పాల్గొన్నారు.

మూడు రోజులుగా పిల్లలకు బైబిల్ పాఠాల గురించి బోధించారు. కార్యక్రమంలో పాస్టర్లు గాబ్రియేలు, హానోకు, నాయకులు దేవ సహాయం, విలియం, ప్రిన్సి, నిస్సి, జాకబ్, విద్యాలత, సుజాత, చంద్రకళ, రవికాంత్ లత, స్టువర్డ్ క్రాంతి కుమార్, రవికుమార్, శాంతి కుమార్, గంగన్న సమూయేలు, మల్లేష్, ఆశీర్వాదం, అంబెడ్కర్ కుమార్, రాజ్ కుమార్, చంద్రయ్య, దేవదాస్, ఆడేపు రవి, ముత్తు, హెలెన్ అమ్మ, సుశీలమ్మ, కనికరమ్మ, తదితరులు పాల్గొన్నారు.