calender_icon.png 18 May, 2025 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతాప్ రెడ్డి మరణం ఐఎంఏ కు తీరని లోటు

18-05-2025 04:12:39 PM

మాజీ అధ్యక్షులు డా. పుల్లారావు..

రేపు సంతాప సభ..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డా. ప్రతాప్ రెడ్డి సంవత్సరాల నుండి కాన్సర్ మహమ్మారితో బాధపడుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణం ఐఎంఏ కు తీరని లోటని ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ మాజీ అధ్యక్షులు, డా. పుల్లారావు తెలిపారు. ఆయన డాక్టర్ల సమస్యల మీద చాలా గట్టిగా పోరాడిన వ్యక్తి అని పేర్కొన్నారు. వైద్య విద్యాభ్యాసంలో ఎన్నో సంస్కరణలకు మార్పు తీసుకొచ్చే విధంగా డాక్టర్ల అన్ని అసోసియేషన్ లను ఒక ప్లాట్ ఫామ్ తీసుకొచ్చి సమస్యలను గురించి చర్చించిన వ్యక్తి అని కొనియాడారు.

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో అత్యంత కీలకంగా పని చేశాడని పేర్కొన్నారు. ప్రతాప్ రెడ్డి లేని లోటు డాక్టర్స్ కుటుంబాలకు తీరని లోటుని తెలిపారు. సోమవారం పట్టణంలోని ఐఎంఏ భవన్ నందు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ దామెర యాదయ్య ఆధ్వర్యంలో ప్రతాపరెడ్డి సంతాప సభను నిర్వహిస్తూనట్లు పేర్కొన్నారు.