క్యాన్సర్‌ను జయించిన చిన్నారులు
అపోలో ఆస్పత్రిలో ఘన సన్మానం
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): ప్రపంచ సార్కోమా మాసం సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని అపోలో క్యాన్సర్ సెంటర్.. ఎముకల క్యాన్సర్‌ను జయించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్న చిన్నారు లు, యువతను ఘనంగా సన్మానించింది. ఎ ముకల్లో నొప్పి, వాపు, గడ్డలు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశ లోనే వైద్యులను సంప్రదిస్తే చికిత్స విజయవంతమవుతుందని వైద్యులు తెలిపారు. అ పోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్, పద్మశ్రీ డా క్టర్ పి.విజయ్ ఆనంద్‌రెడ్డి మాట్లాడు తూ.. సార్కోమా అరుదైన క్యాన్సర్ అయినప్పటికీ ప్రధానంగా చిన్నారులు, యువతలో కనిపిస్తుందని, ముందస్తు గుర్తింపుతో అవయవా లను, ప్రాణాలను కాపాడే అవకాశాలు పెరుగుతాయన్నారు.
ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్ డా క్టర్ రాజీవ్‌రెడ్డి ఆధునిక లింబ్- సాల్వే జ్ శస్త్రచికిత్సలు, ప్రెసిషన్ ఆంకాలజీతో చికిత్స పొందిన చిన్నారులు తిరిగి సాధారణ జీవితంలోకి వస్తున్నారన్నారు. అపోలో హాస్పిట ల్స్ తెలంగాణ సీఈఓ తేజస్వి రావు వీరేపల్లి ఎముకల క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పె రగాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ ని ఖిల్ సురేష్ ఘాడ్యాల్పటిల్, డాక్టర్ అజేష్ రాజ్ సక్సేనా, డాక్టర్ ఎస్‌వీఎస్ ఎస్ ప్రసాద్, డాక్టర్ టీపీఎస్ భండారి, డా క్టర్ పద్మజ లోకిరెడ్డి, డాక్టర్ పవన్ కుమార్ బోయెల్ల, డాక్టర్ యుగంధర్‌శర్మ, డాక్టర్ శిల్పారెడ్డి, సుధాకర్ ప్రసాద్, డాక్టర్ శ్రవణ్ కుమార్ దు బ్బాసి, డాక్టర్ సత్యేష్ నాదెళ్ల పాల్గొన్నారు.






