23 July, 2026 | 2:32 AM

దేవాదుల నీటితో ‘ఎల్ నినో’కు చెక్

23-07-2026 01:26 AM

ములుగు/మహబూబాబాద్, జులై 22 (విజయక్రాంతి): ఎల్ నినో నేపథ్యంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను సమర్థ వంతంగా ఎదుర్కోవడానికి దేవాదుల ప్రాజెక్టును ప్రభుత్వం సమర్థవంతంగా వినియో గించడానికి చర్యలు చేపట్టింది. గోదావరి ద్వారా దేవాదుల ప్రాజెక్టు 38.16 టీఎంసీల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించే దిశగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.  కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని వినియోగించుకునే పరిస్థితి లేకపోవడం,

ఎల్ నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను తట్టుకోవడానికి దేవాదుల ప్రాజెక్టు ప్రత్యామ్నాయ నీటి వనరుగా తెలంగాణ ప్రభుత్వం భావించింది. దేవాదుల ప్రాజెక్టు పరివాహకంలో తొమ్మిది  జిల్లాల పరిధిలో ఉన్న 22 రిజర్వాయర్లను గోదావరి జలాలతో నింపి, 3.16  లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, వరంగల్ నగరానికి తాగునీరు అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.