17 July, 2026 | 1:39 PM

Breaking News

వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •   ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా   •   హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు   •   హైవేపై బొలెరో–లారీ ఢీ: జెర్సీ ఆవులకు గాయాలు   •   రేపు ​మాడుగులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు   •  

అంగన్వాడిలో ఘనంగా జన్మదిన వేడుకలు

24-03-2025 03:37 PM

చిట్యాల,(విజయక్రాంతి): మండలకేంద్రంలోని ఒకటవ అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్జయప్రద ఆదేశాల మేరకు విద్యార్థుల జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. శీలపాక నాగరాజు వనితల కుమారుడు సాహసమిత్ర పుట్టినరోజు నిర్వహించగా, జయప్రద ఆదేశాల మేరకు విద్యార్థుల జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. శీలపాక నాగరాజు వనితల కుమారుడు సాహసమిత్ర పుట్టినరోజు నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఉషా కంపెనీ అసిస్టెంట్ సేల్స్ అడ్మినిస్ట్రేషన్ హెడ్  వెంకట్(Usha Company Assistant Sales Administration Head Venkat) పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్ల నుండి అందుతున్న పౌష్టికాహారాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్వాడి సెంటర్లో ఆట పాటల విద్యతో విద్యార్థుల భవితవ్యాన్ని సక్రమంగా తీర్చిదిద్దడానికి అంగన్వాడీ టీచర్స్ ఆయాలు చేస్తున్నటువంటి కృషిని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఆరోగ్య కమిటీ సభ్యులు, అంగన్వాడి టీచర్ సంధ్యారాణి, ఆయా లావణ్య, తదితరులు పాల్గొన్నారు.