17 July, 2026 | 1:39 PM

Breaking News

వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •   ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా   •   హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు   •   హైవేపై బొలెరో–లారీ ఢీ: జెర్సీ ఆవులకు గాయాలు   •   రేపు ​మాడుగులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు   •  

వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

17-07-2026 01:39 PM

చేర్యాల,జులై 17: చేర్యాల మండలం ఆకునూర్ గ్రామంలో నిర్మించిన ఐదు స్వయం సహా యక బృందాల (వీఓ) భవనాన్ని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజే శ్వర్ రెడ్డి శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతుమహిళల ఆర్థిక సాధికారత,స్వయం ఉపాధి,పొదుపు సంస్కృ తిని బలోపేతం చేయడంలో స్వయం సహాయక బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది.గ్రామీణ ప్రాంత మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపిం చడంలో స్వయం సహాయక బృందాల సేవలు ఎంతో ప్రశంసనీయమని అన్నారు. మహిళల ఐక్యత, క్రమశిక్షణ, పొదుపు అలవాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.వీఓ భవనం అందుబాటులోకి రావడంతో స్వయం సహాయక బృందాల సమావేశాలు,శిక్షణా కార్యక్రమాలు,పొదుపు, రుణాల నిర్వహణతో పాటు ఇతర ఆర్థిక కార్యకలాపాలకు ఎంతో ఉపయో గకరంగా ఉంటుందని చెప్పారు.