17 July, 2026 | 1:32 PM

Breaking News

ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు

17-07-2026 01:32 PM

మహిళా ఉపాధ్యాయురాలు, ప్రధానోపాధ్యాయుల మధ్య నెలకొన్న... ఆధిపత్యపోరు.

పాఠశాలలో 13 మంది విద్యార్థులకు టీసీలిచ్చిన... వైనం.

ఎట్టకేలకు హెచ్ఎం అకీమ్.. సస్పెన్షన్. చేసిన డీఈవో.

తుంగతుర్తి జులై 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని దృక్పథంతో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పిస్తూ, మెస్ చార్జీలు పెంచి, ఉచిత వసతులు కల్పిస్తున్నారు. ఇటువంటి తరుణంలో మహిళా ఉపాధ్యాయురాలు ప్రధానోపాధ్యాయుల మధ్య సమన్వయ లోపంతో విద్యార్థులు జీరో స్థితికి చేర్చి, ప్రధానోపాధ్యాన్ని సస్పెన్షన్ గురి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండ రామారం గ్రామానికి చెందిన జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో 2025-26 సంవత్సరం గాను కేవలం 17 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దీనిలో పాఠశాల తెరవగానే 4 విద్యార్థులు వెళ్లిపోయారు. అనంతరం 6 తరగతిలో ముగ్గురు 7 తరగతి ఐదుగురు, 8 తరగతిలో ఐదుగురు, 10 తరగతి నలుగురు విద్యార్థులు, 9 తరగతిలో జీరో విద్యార్థులు, మొత్తం 13 మంది విద్యార్థులు2026.2027 పాఠశాలలో ఉన్నారు. వీరికి ప్రస్తుతం 5 ఉపాధ్యాయులైన, ప్రిన్సిపాల్ అకీమ్, కోటయ్య, సుజాత ,గీత, వెంకన్నలు తెలుగు హిందీ మ్యాథ్స్ బయోసైన్సు ఫిజికల్ సైన్సు బోధన చేస్తున్నారు.

గడిచిన సంవత్సరం నుండి నీటి వరకు ఇంగ్లీషు  సైన్స్ ,సోషల్ స్టడీల సంబంధించిన సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు లేరు. దీనికి తోడు పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుల మధ్య నెలకొన్న సంఘటనల దృష్ట, ఒకరిపై మరొకరు మహిళా ఉపాధ్యాయురాలు చాడీలు చెప్పుకుంటూ, హెడ్ మాస్టర్ తో, సంబంధాలు తెంచుకొని ఎవరికి వారే యమునా రాజ్యం లాగా పాఠశాల పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాఠశాలలో జరిగిన సంఘటనలు స్థానిక సర్పంచ్ కురిగొప్పుల. నరేష్ గౌడ్ దృష్టికి రాగా, గ్రామంలోని పెద్దమనుషులు, తల్లిదండ్రుల సహకారంతో సద్దుమణి చేశారు. అయినప్పటికీ పాఠశాలలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు ఆధిపత్యం తారస్థాయికి చేరింది. హెడ్మాస్టర్ ను ఏ విధంగా అయినా దెబ్బతీయాలని లక్ష్యంతోనే విద్యార్థుల టీసీలు ఇవ్వటానికి పూనుకున్నట్లు గ్రామంలో ఆరోపణలు వస్తున్నాయి.

పాఠశాల నుండి విద్యార్థుల తల్లిదండ్రులు టీసీలు అడుగుతున్నారని స్థానిక ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లిన, ఏ రకమైన ఆపే చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో ఉన్న 13 మంది విద్యార్థులు పూర్తిస్థాయిలో తల్లిదండ్రులు వారి టీసీలను తీసుకెళ్లగా, నేడు జీరో విద్యార్థులు ,ఐదుగురు ఉపాధ్యాయులతో క్లాస్ రూమ్ లో మొత్తం వెలవెలబోతున్నాయి. దీనితో జరిగిన సంఘటన తెలుసుకున్న సూర్యాపేట డిఇఓ అశోక్ విచారణ నిర్వహించారు. రోజు డిఇఓ ఆఫీసులో మహిళా  ఉపాధ్యాయురాలు , హెడ్మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని స్థానిక సర్పంచ్ డీఈఓ కి వినతిపత్రం అందజేశారు. దీనితో విద్యార్థుల టీసీలు ఇష్యూ చేసిన హెడ్మాస్టర్ అకీమ్ పై, సస్పెన్షన్ వేటు పడ్డది. అసలు పాఠశాలను బ్రష్టు పట్టించడానికి కారకులైన మహిళా ఉపాధ్యాయులు మాత్రం ఎటువంటి బాధ లేకుండా, చక్కగా ఫోన్లో మాట్లాడుకోవడం గమనార్హం. 

ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయాలని లక్ష్యంతో ఉపాధ్యాయులకు లక్షల జీతాలు ఇస్తూ, కనీస సౌకర్యాలు కల్పిస్తూ, తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగిస్తున్న తరుణంలో పాఠశాల విద్యార్థులు జీరోస్థితికి తెచ్చిన కారకులైన వారిపై, జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయి విచారణ జరిపి, గత సమస్యలు తెలిసి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేని ఎంఈఓ, పాఠశాలలో సమస్యలకు కారకులైన మహిళా ఉపాధ్యాయురాలపై, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ,  వివిధ పార్టీ నాయకులు, గ్రామస్తులు, కోరుతున్నారు.

పాఠశాలలో విద్యార్థులు జాయిన్ అవ్వడానికి కృషి చేస్తున్నాం: కోరి కొప్పుల నరేష్ గౌడ్ (బండ రామారం సర్పంచ్)

సంవత్సర కాలం నుండి పాఠశాలలో ఉపాధ్యాయులు హెడ్మాస్టర్ మధ్య తీవ్రస్థాయిలో పెద్ద విమర్శలు జరిగి ,బూతులు కూడా తిట్టుకోవడం గ్రామస్తులు ఆరోపించినట్లు పేర్కొన్నారు జరిగిన సంఘటన మొత్తం నా దృష్టికి వచ్చింది. పాఠశాలలో నియంత పాలన సాగుతున్నది. 13 మంది విద్యార్థులకు టీసీలు ఇవ్వడం బాధాకరమైన విషయం. సంఘటనపై స్థానిక ఎంఈఓ కూడా ఏమీ మాట్లాడకపోవడం విడ్డూరం. పాఠశాలకు,తిరిగి విద్యార్థులు రావడానికి తన వంతు కృషి చేస్తానని, హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.