26 April, 2026 | 11:34 AM

చిన్నారి కథల పుస్తకం

21-12-2024 12:00 AM

యూఏఈకి చెందిన ఆల్ఫాయ్ ఆల్మర్‌జూకికి ప్రస్తుతం ఐదు సంవత్సరాలు. ఈ వయసు చిన్నారులంతా.. స్కూల్‌కి వెళ్లనని, హోంవర్క్ చేయమని మారాం చేస్తూ.. ఉంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం అరబిక్, ఆంగ్ల భాషల్లో.. కథలు, పద్యాలతో పుస్తకాలు రాసేస్తోంది. తన మొదటి పుస్తకానికి ‘ది లాస్ట్ రాబిట్’ అని పేరు పెట్టింది. అందులో జంతువుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో చాలా చక్కగా వివరించిందట. దాంతో పాటు ‘ది ఫ్లవర్’, ‘ది హాని బీ’ వంటి కథలు రాసింది.

తనకు కథలు రాయడంతో పాటుగా.. స్విమ్మింగ్ చేయడం, పుస్తకాలు చదవడం, జిమ్నాస్టిక్స్ చేయడం అంటే చాలా ఇష్టమట. ‘నాకు మూడేళ్ల వయసున్నప్పటి నుంచే మా అమ్మానాన్నలు కథలు చెబుతూ ఉండేవారు. వాళ్లు చెబుతున్న కథలు విని వాటికి సంబంధించిన బొమ్మలు కూడా గీసేదాన్ని’ అని చెబుతున్నది అల్ఫాయ్. తన ప్రతిభతో ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో కూడా స్థానం సంపాదించింది.

ప్రపంచంలో రెండు భాషల్లో పుస్తకం విడుదల చేసిన అతిచిన్న వయసు కలిగిన అమ్మాయిగా చరిత్రలో నిలిచింది. ‘ప్రస్తుతం ‘క్యూట్ క్యాట్’, ‘హ్యాపీ ప్రిన్సెస్’ అనే పుస్తకాలు రాస్తోంది’ అని వాళ్లమ్మ చెబుతున్నారు. చిన్నారి ఆల్మర్‌కు ఆల్ ది బెస్ట్ చెబు తూ.. మరెన్నో కథలు రాయాలని కోరుకుందామా!