1 September, 2026 | 9:12 PM

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

01-09-2026 | 08:05pm

– మేయర్ కొలగాని శ్రీనివాస్

ముకరంపుర,(విజయక్రాంతి): వినాయక చవితి ఉత్సవాలు(Vinayaka Chavithi Festival), గణేష్ నిమజ్జన కార్యక్రమాలను నగరంలో ప్రశాంత వాతావరణంలో, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్(Karimnagar Mayor Kolagani Srinivas) ఆదేశించారు.

వినాయక చవితి ఉత్సవాలు, గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల అధికారులతో మేయర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ వినాయక మండపాల ఏర్పాటు నుంచి గణేష్ నిమజ్జనం పూర్తయ్యే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం నగరపాలక సంస్థ బాధ్యత అని రోడ్లు, ప్యాచ్ వర్క్స్, గ్రావెల్, లైటింగ్, తాగునీరు, పారిశుధ్యం, నిమజ్జన ప్రాంతాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలను ముందుగానే పూర్తి చేయాలి.

అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలి. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తి పూర్వక వాతావరణంలో జరిగేలా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలి” అని అన్నారు.ప్రజలు, వినాయక మండపాల నిర్వాహకులు కూడా అధికారులకు సహకరించాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. నిమజ్జన కార్యక్రమాల్లో ప్రభుత్వం, పోలీస్ శాఖ, నగరపాలక సంస్థ సూచించే మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, డీఈలు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

End