24 April, 2026 | 2:16 AM

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు చిరుమర్తి లింగయ్య సంఘీభావం

24-04-2026 12:54 AM

చిట్యాల, ఏప్రిల్ 23: ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నార్కట్పల్లి బస్ డిపో వద్ద జరుగుతున్న సమ్మెకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సమ్మెలో పాల్గొని కార్మికులకు మద్దతు ప్రకటించారు.

ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటి కైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు కార్మికులకు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆర్టీసీ సంస్థను రక్షించడమే కాకుండా, కార్మికుల హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆర్టీసీ కార్మికులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.