3 August, 2026 | 4:13 AM

ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి

24-08-2024 12:50 AM

బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ మాయాదేవి

చార్మినార్, ఆగస్టు 23: ఆశయ సాధన కోసం నిరంతరం  కృషి చేయాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి అన్నారు. శుక్రవారం బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సిటీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ కోర్సు మూడవ బ్యాచ్ ప్రారంభ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు కష్టపడి చదవి తాము అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవాలన్నారు. సిటీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం విద్యార్థుల భవిష్యత్ కోసం కృషిచేస్తున్న తీరు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య బాలభాస్కర్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, కోర్సు కోఆర్డినేటర్ బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ విప్లవదత్ శుక్లా, నీరజ, శంకర్, కృష్ణవేణి, శాంతి, విద్యార్థులు పాల్గొన్నారు.