3 August, 2026 | 5:26 AM

చోరీ కేసులో జైలు శిక్ష

24-08-2024 12:48 AM

దౌల్తాబాద్, ఆగస్టు 23: గ్రామదేవతల ఆలయాల్లో జరిగిన చోరీ కేసుల్లో నేరస్థుడికి కోర్టు జైలు శిక్షను విధించింది. రాయపోల్ ఎస్సై రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన చిట్యాల రాజిరెడ్డి కొన్ని రోజుల క్రితం రాయపోల్ మండలంలోని పలు గ్రామాల్లో గల ఆలయల్లోని హుండీలను పగుల గొట్టి నగదు, బంగారు అభరణాలు ఎత్తుకెళ్లాడు. పోలీసులు అతడిని అరె స్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. శుక్రవారం గజ్వేల్ కోర్టు సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించినట్టు ఎస్సై తెలిపారు.