జీహెచ్‌ఎంసీలో పలువురికి పోస్టింగ్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (విజయక్రాంతి): బదిలీలపై వచ్చిన పలువురు అధికారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ శుక్రవారం పోస్టింగ్ కేటాయించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అడిషనల్ డైరెక్టర్ సీఎన్ రఘు ప్రసాద్‌ను శానిటేషన్ అండ్ ట్రాన్స్‌పోర్టు విభాగాలకు అడిషనల్ కమిషనర్‌గా, స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ ఎన్ సామ్రాట్ అశోక్‌ను ఎస్టేట్స్ విభాగం అడిషనల్ కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుతం శేరిలిం గంపల్లి జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆర్ ఉపేందర్ రెడ్డికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ విభాగాన్ని అప్పగించారు.
రెవెన్యూ, ఐటీ విభాగాల అడిషనల్ కమిషనర్ స్నేహా శబరీ స్‌కు ట్రాఫిక్ విభాగాన్ని అదనంగా అప్పగించారు. హెల్త్ విభాగం జాయిం ట్ కమిషనర్ శైలజను సంతోష్‌నగర్ డిప్యూటీ కమిషనర్‌గా, జి ఉమాప్రకాష్‌కు రెవెన్యూ విభాగం జాయింట్ కమిషనర్‌గా, ఎన్ వాణిశ్రీకి స్పోర్ట్స్ విభాగం జాయింట్ కమిషనర్‌గా, చీఫ్ వాల్యూయేషన్ అడ్మిన్ విభాగం జాయింట్ కమిషనర్‌గా, హెల్త్ విభాగం జాయింట్ కమిషనర్‌గా కె జయంత్‌రావు, ఐటి విభాగం జాయింట్ కమిషనర్‌గా సి రాధను నియమించారు.






