calender_icon.png 19 July, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో హత్యలు, దోపిడీలను పోలీసులను ఉసిగొలిపి, ప్రేరేపించింది పుట్ట మధే

12-07-2024 05:29:14 PM

 దుద్దిళ్ల కుటుంబం పై పుట్ట మధుకర్ చేసిన ఆరోపణలు అవాస్తవాలు

ముత్తారంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం

మంథని,(విజయక్రాంతి): మంథనిలో హత్యలు, దోపిడీలు, పోలీసులను ఉసి గొలిపి ప్రేరేపించింది కమాన్ పూర్ మాజీ జడ్పీటీసీ పుట్ట మధేనని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం అన్నారు. శుక్రవారం ముత్తారంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... మంథనిలో మంథని మధుకర్ హత్యతో పాటు రామగిరి మండలంలోని లాయరు దంపతులను పోలీసులను అడ్డం పెట్టుకొని హత్యలు చేయించింది ఎవరనీ, అ హత్యల వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసని, ఇంతే కాకుండా ఎమ్మెల్యే ఎలక్షన్ లో ముందు ఓడేడు సర్పంచ్ భక్తారావు మహాముత్తారం మండలంలో ప్రచారానికి వెళితే అక్కడి మాజీ జెడ్పిటిసి మందల రాజిరెడ్డి  బక్కన్నను  హత్య చేసే ప్రయత్నంలో  నీ హస్తం లేదా పుట్ట మధు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకొని మచ్చలేని మా దుద్దిల్ల కుటుంబం పైన ఆవాకులు చేవాకులు చేసి ఏదో సాధిస్తా అనుకుంటే నీ మూర్ఖత్వమే అన్నారు. మంత్రిగా మంథని నియోజవర్గాన్ని శ్రీధర్ బాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఇక తనకు రాజకీయాలలో గెలువలేనని ఓటమి భయంతోనే మచ్చలేని మా నాయకుడిపై అసత్య ఆరోపణలు పుట్ట చేస్తున్నారని సదానందం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట ముత్తారం మాజీ సర్పంచ్ తూటీ రజీతరఫి, నాయకులు ఉన్నారు.