calender_icon.png 19 July, 2025 | 10:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనపర్తి జిల్లాలో విచిత్ర సంఘటన

12-07-2024 01:17:22 PM

వనపర్తి, విజయక్రాంతి : రైతులకు పెట్టుబడి సాయం విషయంలో రైతుల అభిప్రాయ సేకరణలో గందరగోళం. కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన రైతులకే పెట్టుబడి సాయాన్ని అందిస్తామంటూ దానిపై గ్రామస్థాయిలో రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించి వారి అభిప్రాయ సూచన మేరకే ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటిస్తుందంటూ ఈమధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆధ్వర్యంలో రైతుల నుండి అభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులను బయటే ఉంచి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలను మాత్రమే లోపలికి పిలిచి అభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు ప్రకటించడం గందరగోళానికి దారితీసింది. తమ సమస్యలను అధికారుల దృష్టికి ప్రభుత్వ దృష్టికి చేరవేస్తారని నమ్మకంతో ఉన్న రైతులను బయటే ఉంచడంపై రైతులు పెదవిరుస్తున్నారు.