13-07-2024 12:00:00 AM
కాళేశ్వరం నివేదిక సమర్పించేందుకు అధికారుల ఉరుకులు, పరుగులు.. జలసౌధలో సమీక్ష
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై త్వరితగతిన పురోగతి సాధించాలని సాగునీటి పారుదల శాఖ అధికా రులు మల్లగుల్లాలు పడుతున్నారు. నివేదికను సిద్ధం చేసేందుకు ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు అధికారుల బృందం శుక్రవారం జలసౌధలో కీలక సమావేశం నిర్వహించింది. సెంట్రల్ సాయి ల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్‌ఎంఆర్‌ఎస్), సెంట్రల్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యుపీఆర్‌ఎస్), నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) బృందంతో ఇఎన్‌సి (ఓఅండ్‌ఎం), రామగుండం ఈఎన్‌సీ ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. నిపుణుల కమిటీతో పాటు ఎన్‌డీఎన్‌ఏ అధికారులతో రాష్ర్ట ప్రభుత్వ అధికారులు చర్చించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై నివేదికను వేగవంతంగా ముం దుకు తీసుకెళ్లాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.