గోదావరిఖని ప్రజలకు భద్రత, మనోధైర్యం కల్పించడమే మా లక్ష్యం
పట్టణంలో బాంబు స్క్వాడ్, జాగిలాలతో విస్తృత తనిఖీల్లో గోదావరిఖని సీఐ ఇంద్రసేనా రెడ్డి
మంథని,(విజయ క్రాంతి) బ్లాక్ డే సందర్బంగా గోదావరిఖని 1 టౌన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. శనివారం గోదావరిఖని పట్టణంలో 1-టౌన్ ఇంద్రసేనా రెడ్డి నేతృత్వంలో పట్టణం లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పారిశ్రామిక నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాలలో పోలీసులు బాంబు స్క్వాడ్, జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. అడుగడుగునా పోలీసులు సోదలు జరిపారు. పట్టణంలోని బస్టాండ్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, లక్ష్మి నగర్ వ్యాపార సముదయాలలో, రమేష్ నగర్, అడ్డగుంట పల్లి తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో తనిఖీలు ముమ్మరం చేశారు.
ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా సోదా చేశారు. నిత్యం రద్దీగా ఉండే దుకాణ సముదాయాల ప్రాంతాల్లో నిలిచి ఉన్న వాహనాలను బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. బస్టాండ్ ప్రాంతాన్ని బాంబు స్క్యాడ్ సిబ్బంది తనిఖీలు చేశారు. అనుమానం వచ్చిన వస్తువులను బ్యాగ్ లను జాగిలాలతో సోదాలు చేశారు. తనిఖీ లలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.




