06-12-2025 03:11:21 PM
ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు
ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బీఆర్ అంబేడ్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 6, 1956న డా.అంబేద్కర్ మరణించారు. కాబట్టి ప్రతి సంవత్సరం డిసెంబర్ 6న ఆయన వర్ధంతిని వర్థంతి నీ జరుపుకుంటామని అన్నారు. దీనిని ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ, 'మహా పరినిర్వాణ్ దివస్'గా కూడా జరుపుకుంటారు.
భారత రాజ్యాంగ పితామహుడిగా, సామాజిక సంస్కర్తగా ఆయన కృషిని నివాళులర్పించి గుర్తు చేసుకుంటామని అని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని తెలిపారు. అనంతరం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో,మున్సిపల్ అధికారులతో కలిసి ,రాజ్యంగ నిర్మాత అంబేద్కర్, చిత్రపటానికి, పూలమాల వేసి,నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, పట్టణంలోని పలు వార్డ్ ల ప్రత్యేక అధికారులు, సూర్యవర్ధన్, జ్యోతి, మేనేజర్ వాసంతి, ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.