calender_icon.png 26 August, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ హాస్టల్ ను తనిఖీ చేసిన సీఐ, ఎంపీడీవో

26-08-2025 08:56:43 PM

చిట్యాల,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ ను చిట్యాల సిఐ దగ్గు మల్లేష్ యాదవ్, ఎంపీడీవో జయశ్రీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ పరిసర ప్రాంతాలు, భోజనాలను, వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు,క్రమ శిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. హాస్టల్లో ఏలాంటి ఇబ్బందులు తలెత్తిన నిర్భయంగా తల్లిదండ్రులకు,మండల అధికారులకు చెప్పవచ్చన్నారు. చదువుతోపాటు క్రీడలపై శ్రద్ధ చూపించాలని విద్యార్థులకు సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.