26-08-2025 09:04:42 PM
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): బాంగ్లాదేశ్ నుండి వచ్చే రోహింగ్యాల ను అడ్డుకోవాల్సింది ఎవ్వరు? వారిని తిరిగి పంపే బాధ్యత ఎవ్వరిపై ఉంటుందో తెలుసుకొని మాట్లాడాలని మార్వాడి గో బ్యాక్ అంటే సంకరజాతి వెధవలనటం పై కరీంనగర్ దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జడల అంజయ్య అనే వ్యక్తి తన పేస్ బుక్ లో రహింగ్యాల ను గోబ్యాక్ అనండిరా సంకరజాతి వేదళ్ళారా అనటంపై స్పందించిన దళిత సంఘాల నాయకులు మంగళవారం కరీంనగర్ దళిత సంఘం కార్యాలయం లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశం లో దళిత సంఘాల సీనియర్ నాయకులు గసికంటి కుమార్,గండి గణేష్, కామారాపు అనిల్, శ్యామ్ పాల్గొని మాట్లాడుతూ ఎన్ టి పి సి కృష్ణనగర్ కాలనికి చెందిన జడల అంజయ్య రోహింగ్యలు గో బ్యాక్ అనండిరా సంకరజాతి వేదవల్లారా అన్న మాటలు వెంటనే వెనక్కి తీసుకొని కరీంనగర్ కోర్టు చౌరస్తా లోని డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ విగ్రహం ముందు బహిరంగ క్షేమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్, గుజరాత్ ల నుండి వచ్చిన మార్వాడి లు హైదరాబాద్ ముండా బజార్ లో దళితులను కొట్టి తక్కువ కులం వాళ్ళు అంటూ తిట్టడం విషయంపై దళిత జాతి ప్రజలు తీవ్ర అసహనంతో ఉండటం, అలాగే తెలంగాణ రాష్ట్రంలో అనేక వ్యాపారాలు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రల నుండి వచ్చిన మార్వాడి లు వారు కైవసం చేసుకొని తెలంగాణ వ్యాపారులకు ఉపాధి లేకుండా చెయ్యటం, మార్వాడి ఖబార్ధార్ అంటూ పాటపడిన తెలంగాణ శ్యామ్ ను మార్వాడి నాయకుడు గౌ పుత్ర సేన తెలంగాణ అధ్యక్షుడు ఫోన్ ద్వారా తిట్టడం, మార్వాడి లు దాడులకు పాల్పడటాన్ని నిరసిస్తూ దళిత సంఘాలు ఉద్యమాలు చేపట్టాయన్నారు.
తర్వాత మార్వాడీలు క్షేమాపణ చెప్పడంతో కాస్తా సద్ధుమనుగుతున్న సమయంలో దళితులను రెచ్చ గొట్టే విధంగా జడల అంజయ్య లాంటి కొందరు వ్యక్తులు నోటి దురుసు తో దళితులను ఉద్దేశించి రోహింగ్యలను గో బ్యాక్ అనండిరా సంకర జాతి వెధవల్లారా అంటూ తన సోషల్ మీడియా పేస్ బుక్కులో పోస్ట్ పెట్టటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహింగ్యలు బాంగ్లాదేశ్ నుండి భారత దేశం లోకి చొరబడకుండా, వారికి ఆశ్రమం కలిపించకుండా, వెనక్కి పంపే బాధ్యత ప్రభుత్వాలాది కాదా? అంటూ ప్రశ్నించారు. తమ జాతికి జరిగిన అవమానం పై ఉద్యమిస్తున్నా దళిత ప్రజలను ఉద్దేశపూర్వకంగా రహింగ్యలను గో బ్యాక్ అనండిరా సంకర జాతి వెధవళ్ళారా అంటే వింటూ ఊర్కునేది లేదని ఖబర్దార్ అని హెచ్చరించారు. ముక్కు భూమి రాసి క్షేమాపణ చెప్పకుంటే ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతామన్నారు. ఈ సమావేశం లో దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.