calender_icon.png 26 August, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రామారావు పటేల్

26-08-2025 08:53:47 PM

కుభీర్: నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామారావు పటేల్ మంగళవారం కుభీర్ మండల కేంద్రంలోని వర్ని గ్రామానికి చెందిన తమ్మల సాయవ్వ W/O దశరథ్ మరియు కుప్టి గ్రామానికి చెందిన ఏకొండ కృష్ణయ్య S/O రాజలింగు లకు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) కింద అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య సమస్యలు, అత్యవసర వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్కనే నిలుస్తుందని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పటివరకు వందలాది మంది పేద కుటుంబాలు లబ్ధి పొందిన విషయాన్ని గుర్తు చేశారు. అవసరమైన పత్రాలను సమర్పిస్తే ప్రతి అర్హుడికి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.