calender_icon.png 6 December, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సిఐ రామ్ లాల్

06-12-2025 08:33:08 PM

మాగనూరు: గ్రామపంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని నారాయణపేట జిల్లా పోలీసులు భద్రత పై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిక్స్పాక్షపాతoగా సాగేందుకు శనివారం మాగనూరు మండల పరిధిలోని వడ్వా టు గ్రామంలో ఉన్న సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను మక్తల్ సీఐ రాంలాల్, మాగనూరు ఎస్సై అశోక్ బాబు ప్రత్యక్షంగా పరిశీలన నిర్వహించారు.

అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భద్రతా పరిస్థితులను సూక్ష్మంగా పరిశీలించి అక్కడి పోలీసులు ఎన్నికల సిబ్బందితో సమన్వయము సన్నద్ధత పై సమగ్ర చర్చ జరపారు. సమస్యాత్మకoగా గుర్తించ బడిన బూతుల్లో అధిక బందోబస్తు ఏర్పాటు చేయడం అవసరమైన లైటింగ్ ,బేరింగ్ ,సీసీ కెమెరాలు, క్యూలైన్ నిర్వహణ, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ,వంటి సదుపాయాలపై సూచనలు ఇవ్వడం జరిగినది. సందర్శనలో వారు గ్రామం పరిస్థితులు, జనసంచారం, గత ఎన్నికల్లో నమోదైన సమస్యలు స్థానికంగా సున్నితంశాలను పరిగణలోకి తీసుకొని భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడం జరుగుతుందని తెలిపారు.

ఎన్నికల రోజున ఎటువంటి అల్లర్లు ,బెదిరింపులు, అక్రమ రవాణాలను, అరికట్టేందుకు పోలీసులు పూర్తిగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా కృష్ణా మండలంలో కొన్ని సమస్యత్మక గ్రామం ల ను సిఐ రామ్ లాల్ ఎస్సై ఎస్ ఎం నవీద్ సందర్శించారు. కృష్ణ బార్డర్ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల నిర్వహించి ఎన్నికలవేళలో అక్రమ రవాణాలు జరగకుండా చూడాలని పోలీసు సిబ్బందికి తెలిపారు.