హోర్ముజ్‌లో సీమైన్స్
- జలసంధిలో అడుగడుగునా ఉచ్చు
- అమెరికా, దాన్ని మిత్రదేశాల నౌకలు అడుగుపెడితే పేలేలా నేవల్ మైన్స్
- శత్రునౌకలకు జలసంధిని మృత్యుకుహరంగా మార్చిన ఇరాన్
- ఇరాన్ వద్ద 2,000 నుంచి 6,000 వరకు సీమైన్స్
టెహ్రాన్, మార్చి 11: అమెరికా ఇజ్రాయెల్, ఇరాన్ ఉధృతమైన దాడుల నేపథ్యం లో హోర్ముజ్ జలసంధి శత్రునౌకలకు మృత్యుకుహరంగా మారుతుంది. అమెరికా- దాడులు తీవ్రమవుతున్న కొద్దీ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకొనేందుకు ఇరాన్ నుంచి ప్రతిఘటన ఉధృతమవుతోంది. తన అధీనంలో ఉన్న హోర్ముజ్ జలసంధి అంతా సీమైన్స్‌ను రంగంలోకి దించింది. యూఎస్, దాని మిత్రదేశాల నౌకలు అడుగుపెడితే పేల్చేసేలా నేవల్ మైన్స్‌ను ఎక్కడికక్కడ అమర్చింది. ఈ చర్యలు ట్రంప్‌సర్కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
సముద్రంలో ఒక్కసారి మైన్స్‌ను అమర్చాక నౌకలు ఏమార్గం లో ప్రయాణిస్తే హోర్ముజు జలసంధిని దాటగలవో ఒక్క ఇరాన్‌కు మాత్రమే తెలుసు. దీంతో ప్రపంచ దేశాలు భయభ్రాంతులకు గురవుతున్నాయి. ఏమిటీ నేవల్ మైన్స్ అంటే.. శత్రువులు సరిహద్దులు దాటకుండా భూమిలో మందుపాతర్లు అమర్చినట్లే స ముద్ర జలాల్లో అమర్చే వాటిని సీమైన్స్ అంటారు. నౌకలు, జలాంతర్గాములను ధ్వం సం చేయడానికి అవి ప్రయాణించే మార్గా ల్లో ఏర్పాటుచేస్తారు. దీంతో శత్రువు ఆ మార్గంలోకి రాకుండా ఇవి భయపెడుతుంటాయి. వీటిల్లో వివిధరకాల మైన్స్ ఉన్నా యి.
వీటిని రిమోట్ సాయంతో పేల్చవచ్చు. వీటిల్లో మైన్‌స్థాయిని బట్టి50 నుంచి 1,000 కేజీల పేలుడు పదార్థాలు ఉంటా యి. మిగిలిన ఆయుధాలతో పోలిస్తే ఇవి చౌక కూడా. ఇరాన్ వద్ద దాదాపు 2,000 నుంచి 6,000 వరకు సీమైన్స్ ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. వీటిని చైనా, రష్యా నుంచి కొనుగోలుతోపాటు.. సొంతంగా ఉత్పత్తి చేస్తోంది. ఇరాన్ నౌకాదళంలోని చిన్న నౌకలు ఒక్కోటి రెండు నుంచి మూడు మైన్సు సముద్రంలో అమర్చగలవు.
ఇలాం టి నౌకలు వందల సంఖ్య లో ఇరాన్ వద్ద ఉన్నాయి. ఇక సబ్మెరైన్ల సాయంతో సముద్రంలో అమర్చే మైన్స్ కూడా టెహ్రాన్ వద్ద ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వీటిసా యంతో సముద్రం లో మైన్స్‌ను పెట్టడం వల్ల హోర్ముజ్ జలసంధిని దాటడం రవా ణా నౌకలకు అసాధ్యంగా మారిపోతుంది. దీంతో రానున్న రోజుల్లో ఓడలకు జలసంధి మృత్యు మార్గంగా మారనుంది.




