calender_icon.png 6 December, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన ఆర్డీవో

06-12-2025 08:32:56 PM

నిజాంపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ ఆర్డీవో రమాదేవి నామినేషన్లు, గుర్తుల కేటాయింపు ప్రక్రియను పరిశీలించారు. నిజాంపేట మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు విడత ఎన్నికలను నామినేషన్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు గుర్తు కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఎన్నికలు శాంతియుత వాతావరణం లో జరిగేలా చూడాలని అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ రమ్యశ్రీ, ఎంపీడీవో రాజీరెడ్డి తదితరు అధికారులు ఉన్నారు.