06-12-2025 08:35:39 PM
భూత్పూర్: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషివల్లే చిన్న రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్ అన్నారు. శనివారం భూత్పూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అన్నగారిన వర్గాల అభ్యున్నతి కోసం, అసమానతలు లేని సమాజం కోసం చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. బాబా సాహెబ్ ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన్ గౌడ్, నరేందర్, బోరింగ్ నర్సింలు, మహబూబ్ పాషా, గడ్డం ఎల్లప్ప, గడ్డం యాదయ్య, మట్టి ఆనంద్, ఎర్రన్న, మచ్చేందర్, అప్రోజ్, అస్లాం, దిలీప్, నర్సింలు, మునితో పాటు తదితరులు ఉన్నారు.