28 June, 2026 | 1:56 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

చెత్త సేకరణలో అశ్రద్ధ వద్దు

12-03-2026 01:34 AM
  1. విధులకు రాని ఆటోల సీజ్ 
  2. సీఎంసీ కమిషనర్ సృజన 

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 11 (విజయక్రాంతి): సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని కమిషనర్ సృజన అధికారులను హెచ్చరించారు. మంగళవారం కుత్బుల్లాపూర్ జోన్ చింతల్ సర్కిల్ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఆమె పర్యటించారు. 

విధుల్లో నిర్లక్ష్యం వహించిన కింది స్థాయి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, పనితీరు మెరుగుపడకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎస్‌ఏటీ వాహనాల ద్వారా 100 శాతం చెత్త సేకరణ జరుగుతుందా? లేదా? అని ఆరా తీశారు. ఎస్‌ఏటీ వాహనాల డ్రైవర్లు నిరంతరాయంగా విధులకు హాజరు కావాలని స్పష్టం చేశారు. డ్రైవర్లు విధులకు రాకపోతే, సీజ్ చేసి వేరొక డ్రైవర్కు బాధ్యతలు అప్పగించాలన్నారు.