calender_icon.png 21 February, 2026 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చురుకుగా సాగుతున్న సిబిల్ సిటీ రోడ్డు పనులు

21-02-2026 12:00:00 AM

  1. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రం

రోడ్డు ఇబ్బందులపై విజయక్రాంతి వరుస కథనాలు

రాజేంద్రనగర్ ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఫిబిల్ సిటీ రోడ్డు పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. గతంలో రోడ్డు ఇబ్బందుల వల్ల వర్షం నీరు రోడ్డుపై చేరి చెరువును తలపిస్తున్న తీరును విజయ క్రాంతి పత్రికలో వరుసగా కథనాలు ప్రచురితమయ్యాయి. వర్షాకాలంలో వర్షం నీటితో రోడ్డు గుంత లు కావడం వల్ల ఎంతోమంది ప్రయాణికులు ఇబ్బందులు పడటంతో పాటు ప్రమా దాలకు గురయ్యారు.

సాధన మెడికల్ కళాశాల నుండి ఫిబిల్ సిటీ వరకు దాదాపు 900 మీటర్ల వరకు రోడ్డు నిర్మించేందుకు గతంలో మున్సిపల్ కార్పొరేషన్ నుండి రెండు కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినప్పటికీ పనులను చేయడంలో కాంట్రాక్టర్.పనులను చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై గత డిసెంబర్ లో ‘ ప్రకాష్ గౌడ్ సాబ్ జర దేకో బాయ్‘ అనే కథనం ప్రచురితం కావడంతో అప్పట్లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు .

ఇటీవల బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్‌ఎంసి పరిధిలో విలీనం కావడం వల్ల రోడ్డు పనుల ను చేపట్టడంలో మళ్లీ అధికారులు యధావిధిగానే తమ నిర్రక్షాన్ని ప్రదర్శించారు. మళ్లీ ఇటీవల ‘విజయ క్రాంతిలో’ రోడ్డు ఇబ్బందులపై కథనం ప్రచురితం కావడంతో అందుకు స్పందించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ సర్కిల్ డిసి సురేందర్ రెడ్డి తో మాట్లాడి రోడ్డు పనులను ప్రారంభించాలని సూచించారు.

డిప్యూటీ కమిష నర్ సురేందర్ రెడ్డి రోడ్డు పనులను వెంటనే ప్రారంభించి 20 రోజుల్లో పనులు పూర్తి చేయాలని డీఈఈ యాదయ్య ఏఈ నాగిరెడ్డి లను ఆదేశించడంతో రోడ్డు లెవలింగ్ ను చూసుకొని సిసి రోడ్డును ప్రారంభించారు సాధన మెడికల్ కళాశాల నుండి 90 మీటర్ల వరకు సిసి రోడ్డు నిర్మాణం అక్కడి నుండి ఫిబిల్ సిటీ వరకు బిటి రోడ్డును నిర్మాణం చేయనున్నట్లు ఏఈఈ నాగిరెడ్డి తెలిపారు