calender_icon.png 24 September, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ కీలక ఆపరేషన్

24-09-2025 10:47:24 AM

న్యూఢిల్లీ: బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్ కేసులో సీఐడీ(Criminal Investigation Department) కీలక ఆపరేషన్ చేపట్టింది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో ఆరు ప్రాంతాల్లో సీఐడీ సోదాలు చేస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో(betting app promotion case) 8 మందిని సీఐడీ అరెస్ట్ చేసింది. బెట్టింగ్ యాప్స్ ను ఆపరేటింగ్ చేస్తున్న నిర్వాహకుల్లో 8 మంది అరెస్ట్ చేసినట్లు సీఐడీ పేర్కొంది. నిందితులు 6 బెట్టింగ్ యాప్ లు నిర్వహిస్తున్నట్లు సీఐడీ గుర్తించింది. నిందితుల నుంచి భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు, కస్టమర్ల డేటా స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రధాన నిందితులు విదేశాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు రాష్ట్రాల్లో సిబ్బందిని నియమించుకుని యాప్స్ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.