24-09-2025 10:13:05 AM
కోల్‌కతా: కోల్‌కతాను వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు(heavy rainfall) జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్ షాక్ తో పలు మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఎందరో ప్రజలు నిరాశ్రులయ్యారు. బుధవారం నాడు కోల్‌కతా(Kolkata ) సాధారణ స్థితికి తిరిగి వచ్చింది. ఇందుకు ఘోరంగా శ్రమించాల్సి వచ్చింది. ముఖ్యంగా సాల్ట్ లేక్, నగరంలోని ఉత్తర, మధ్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. కుండపోత వర్షం కారణంగా 10 మంది మరణించారని అధికారులు వెల్లడించారు.
మహానగరంలో జనజీవనం స్తంభించిపోయింది. రాబోయే 24 గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. అయితే కొన్ని చోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు జల్లులు పడతాయని, అయితే ఆకాశం మేఘావృతమై ఉంటుందని అంచనా వేసింది. కోల్‌కతా దాని పరిసర ప్రాంతాలలోని లోతట్టు ప్రాంతాల నుండి అధికారులు రాత్రంతా శ్రమించి నీటిని తోడేశారు. కానీ బిధాన్‌నగర్ నివాసితులు వరదల్లో చిక్కుకున్నారు. భారీ వర్షాల కారణంగా వాహనాలు తక్కువ వేగంగా కదులుతున్నాయి.