calender_icon.png 24 September, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ లక్కీ డ్రా స్కీమ్

24-09-2025 12:46:07 PM

ప్రయాణికులకు అవకాశం

కుమ్రం భీం అసిఫాబాద్(విజయ క్రాంతి): దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (RTC) ఆసక్తికరమైన లక్కీ డ్రా స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు అసిఫాబాద్ డిపో పరిధిలోని సూపర్ లగ్జరీ, లహరి బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు లక్కీ డ్రా అవకాశాన్ని కల్పించడం జరిగిందని  డిపో మేనేజర్ కె.వి. రాజశేఖర్ ప్రకటనలో తెలిపారు.ప్రయాణికులు టికెట్ వెనుక భాగంలో తమ పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వ్రాయాలి. ఆ టికెట్‌ను అసిఫాబాద్, కాగజ్‌నగర్ బస్టాండ్‌లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక లక్కీ డ్రా బాక్సుల్లో వేసే అవకాశం ఉంటుంది. లక్కీ డ్రా ను అక్టోబర్ 8న సాయంత్రం 4 గంటలకు ఆదిలాబాద్‌లోని రీజినల్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించనున్నారు.

బహుమతుల వివరాలు:- 

మొదటి బహుమతి – రూ. 25,000

రెండో బహుమతి – రూ. 15,000

మూడో బహుమతి – రూ. 10,000

దసరా పండుగ ఉత్సాహాన్ని పెంచేలా RTC ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని డిపో మేనేజర్ తెలిపారు. ప్రయాణికులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.