24-09-2025 09:25:18 AM
హైదరాబాద్: త్వరలో జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో(Jubilee Hills Constituency) మంత్రులు పర్యటించనున్నారు. షేక్ పేట్ డివిజన్(Sheikhpet Division)లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ పర్యటించనున్నారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ కమిషన్ మంత్రులకు వివరించారు. ప్రారంభించిన పనులను వేగవంతం చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు.
జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(BRS MLA Maganti Gopinath) ఆకస్మికంగా మరణించడంతో ఈ ఎన్నిక అనివార్యం అయింది. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ స్థానాన్ని కాపాడుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇందుకు గానూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్ వారిగా కార్యకర్తలతో తెలంగాణ భవన్ లో వరస సమావేశాలు జరుపుతున్నారు. ఈ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ లో కారును పక్కన పెట్టి హస్తం గెలిచేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. అటు బీజేపీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మరి జూబ్లీహిల్స్ లో ఎవరు జెండా ఎగురవేస్తారో చూడాల్సి ఉంది.