3 September, 2026 | 4:54 PM

ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ నివాసంలో సీఐడీ సోదాలు

07-06-2024 | 05:16pm

హైదరాబాద్ : ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి ఇంట్లో శుక్రవారం ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో మద్యం విక్రయంలో వాసుదేవ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తూ కొత్త మద్యం విధానం పేరుతో వైసీపీ నేతలకు లబ్ధి చేకూర్చేలా పని చేశారని ఆరోపణలున్నాయి. ఏపీలో జె- బ్రాండ్ మద్యం తేవడంతోపాటు డిస్టలరీలన్నీ అనధికారికంగా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తూ ప్రభుత్వ దుకాణాల్లో బ్రాండ్ మద్యం అమ్మించిన అభియోగాలు ఉన్నాయి. దీంతో శుక్రవారం హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని ఆయన ఇంట్లో ఏపీ సీఐడీ పోలీసులు మూడు వాహనాల్లో వచ్చిన సోదాలు చేస్తున్నారు.