కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
07-06-2024 | 04:46pm
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీ బయలుదేరనున్నారు. శనివారం ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం పాల్లొననున్నారు. రేవంత్ రెడ్డితో పాటు నూతనంగా ఎంపికైన కాంగ్రెస్ ఎంపీలు కూడా పయనం కానున్నారు. ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా అధిష్టానంతో భేటీ కానున్నారు. లోక్ సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష పదవి, నామినేటెడ్ పోస్టుల భర్తీ, కార్పొరేషన్ పదవుల భర్తీ వంటి కీలక అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించించే అవకాశమున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సీడబ్ల్యూసీ సమావేశంలో దీపాదాస్ మున్షీ, వంశీచంద్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహలు పాల్గొననున్నారు.






