భాషను బతికించే శక్తి సినిమాకే ఉంది
అనంతిక సునీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించగా ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘8 వసంతాలు’. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఫణీంద్ర చిత్ర విశేషాలను పంచుకున్నారు. “మను’ సిని మా తర్వాత ఒక బలమైన స్త్రీ పాత్ర చుట్టూ కథను చెప్పాలనిపించింది. స్త్రీ కోణంలోకి వెళ్లి ఆ సున్నితత్వాన్ని పట్టుకోవడానికి, కథ రాయడం కంటే స్త్రీ దృక్కోణాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎక్కు వ టైమ్ పట్టింది.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన డిగ్నిటీ కోల్పోకుండా ఉండే అమ్మాయి ప్రయాణం ఇది. 19 ఏళ్లలో జరిగే ప్రేమ, 27 ఏళ్ల వయసులో జరిగే ప్రేమలో తను మానసికంగా ఉన్న తేడాను చాలా సున్నితంగా ఎక్స్ ప్లోర్ చేయాలనుకున్నా. గురుశిష్య పరంపరను కూడా చూపించాలనుకు న్నా. తన చుట్టుపక్కల పాత్రల నుంచీ తన క్యారెక్టర్ ఎక్స్‌ప్లోర్ చేయాలని భావించా. ఆ పాత్ర ఎన్ని కష్టాలు వచ్చినా మృదుత్వాన్ని కోల్పోదు.
ఇలాంటి పాత్రలు రాసినప్పుడు నాకు స్ఫూర్తి.. -బలమైన స్త్రీ పాత్ర లే. అవి ఎక్కడినుంచైనా రావచ్చు. -మేము ఇందులో గ్రాం ధికం వాడలేదు. సినిమాలో రెండు పాత్రలు కూడా రచయితలే. ఆ పాత్రలు సహజసిద్ధంగా అలానే మాట్లాడుతాయి. -భాష ను బతికించే శక్తి సినిమాకే ఉంది. సినిమాకు ఒక శక్తి ఉంది. ఎవరో ఒకరు ఆ భాష చూసి ఇష్టాన్ని పెంచుకోవచ్చు. నేను ఒక ప్రయత్నం చేశాను” అన్నారు.






