16 April, 2026 | 11:24 AM

భయపడి అడుగు ఆపకే..

18-06-2025 12:00 AM

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ కథానాయకుడిగా రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌గా ‘భూ అంటే భూతం..’ను విడుదల చేశారు.

మేనకోడలు బేబి దిత్యకు మేనమామ నితిన్ ధైర్యం చెప్పే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించారు. ‘భూ అంటూ భూతం వస్తే ఆగకె అమ్మాడి.. ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి.. పుట్టగానే నేరుగా నువ్వు పరుగెత్తలే.. పట్టుకుంటూ పడుతూ నడకే నేర్చావే.. భయపడి అడుగు ఆపకే..’ అంటూ సాగుతున్న ఈ పాటకు అజనీష్ లోకనాథ్ స్వరాలు సమకూర్చగా, అనురాగ్ కులకర్ణి, అక్షిత పోల పాడారు. సింహాచలం మన్నేలా రాశారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్; ఎడిటర్: ప్రవీణ్ పూడి.